Tue Nov 05 2024 16:48:58 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి కాంగ్రెస్ ప్లీనరీ
అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు నేటి నుంచి రాయపూర్ లో జరగనున్నాయి.
అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు నేటి నుంచి రాయపూర్ లో జరగనున్నాయి. ఛత్తీస్ఘడ్ రాజధాని రాయపూర్ లో మూడు రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ 85 ప్లీనరీలకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. దాదాపు 200 మంది ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశాలకు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు హాజరుకానున్నారు.
ఆరు తీర్మానాలను...
ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు తీర్మానాలను ప్రవేశపెట్టనుంది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సబ్జెక్ట్ కమిటీ తీర్మానాలను ఖరారు చేయనుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎన్నికలు కూడా ఈ సందర్బంగానే జరుగుతాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేయనున్నారు. కలసి వచ్చే పార్టీలతో కలసి రానున్న ఎన్నికల్లో గెలిచి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఈ ప్లీనరీలో చర్చించనున్నారు.
Next Story