Mon Dec 23 2024 16:09:54 GMT+0000 (Coordinated Universal Time)
Budget : నేడు అఖిలపక్ష సమావేశం
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది.
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉదయం పదకొండున్నర గంటలకు ఈ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకూ జరగనున్న నేపథ్యంలో తమకు ఉభయ సభల్లో సహకరించాలని కోరుతూ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.
పార్లమెంటు సమావేశాల్లో...
ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు సమాచారం ఇచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఎన్నికల సమయం కావడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ సమావేశాల్లో మొత్తం పంధొమ్మిది బిల్లులు తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. గత పార్లమెంటు ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈసారి సమావేశాలకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నారు.
Next Story