Mon Dec 23 2024 07:43:22 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి స్కూళ్లకు సెలవులు !
దేశంలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ కారణం చేతే నేటినుంచి పాఠశాలలన్నీ మూతపడ్డాయి. ఈ మేరకు
దేశంలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ కారణం చేతే నేటినుంచి పుదుచ్చేరిలోని పాఠశాలలన్నీ మూతపడ్డాయి. ఈ మేరకు పుదుచ్చేరి హోం, విద్యాశాఖ మంత్రి ఎ.నమశ్శివాయం ట్వీట్ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సెలవులు ప్రకటించినందున 1 నుండి 9 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు తిరిగి ప్రారంభమవుతాయని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. పుదుచ్చేరి, కరైక్కల్, మాహి, యానాంలలో 1 వతరగతి నుంచి 9వ తరగతుల వరకూ పాఠశాలలను మూసివేస్తున్నట్లు తెలిపారు.
రోజువారీ కేసుల సంఖ్య పెరుగుదల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రైవేట్‌గా నిర్వహించబడే, ప్రభుత్వ-సహాయక సంస్థలతో సహా అన్ని పాఠశాలలు మూసివేయబడతాయని పాఠశాల విద్యా డైరెక్టర్ పిటి రుద్ర గౌడ్ తెలిపారు. అలాగే కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలోనే 25వ జాతీయ యూత్ ఫెస్టివల్ భౌతిక కార్యక్రమాన్ని ప్రభుత్వం నిలిపివేసింది.
Next Story