Thu Nov 21 2024 12:52:59 GMT+0000 (Coordinated Universal Time)
సీఐఎస్ఎఫ్ లో ఆల్ విమెన్ బెటాలియన్
సీఐఎస్ఎఫ్ కు సంబంధించిన ఆల్ విమెన్ బెటాలియన్
సీఐఎస్ఎఫ్ కు సంబంధించిన ఆల్ విమెన్ బెటాలియన్ అతి త్వరలోనే ఏర్పడబోతోంది. మొట్టమొదటి సారిగా వెయ్యి మంది సిబ్బందితో కూడిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన ఆల్-విమెన్ బెటాలియన్ను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని హోం మంత్రిత్వ శాఖ ఆమోదించింది. సీనియర్ కమాండెంట్ ర్యాంక్ అధికారి నేతృత్వంలో మొత్తం 1,025 మంది సిబ్బందితో సీఐఎస్ఎఫ్లో రిజర్వ్ బెటాలియన్ అనే ప్రత్యేకమైన మహిళా విభాగాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. విమానాశ్రయాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతను భారీగా పెంచుతున్న నేపథ్యంలో 1000మందికి పైగా మహిళా సిబ్బందితో కూడిన సీఐఎస్ఎఫ్ రిజర్వ్ బెటాలియన్ను ఏర్పాటు చేయాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించుకుంది.
ప్రస్తుతం సీఐఎస్ఎఫ్లో 12 రిజర్వ్ బెటాలియన్లు ఉన్నాయి. సీఐఎస్ఎఫ్లోని మహిళా రిజర్వ్ దళాలు సివిల్ విమానాశ్రయాలు, కీలకమైన ప్రదేశాలు, ప్రభుత్వ ఆఫీసులు, చారిత్రాత్మక ప్రాంతాల్లో భద్రతను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఈ దళంలో మహిళా సిబ్బంది 7 శాతం మంది ఉన్నారు. కొత్త బెటాలియన్ కోసం ముందస్తు నియామకం, శిక్షణకు సంబంధించి CISF ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ఆల్ విమెన్ బెటాలియన్ కు సంబంధించి కొత్త ప్రధాన కార్యాలయం కోసం అన్వేషణ కూడా ప్రారంభించారు. ఎలైట్ బెటాలియన్ను రూపొందించడానికి ప్రత్యేకంగా శిక్షణను రూపొందిస్తున్నట్లు సిఐఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి.
Next Story