Wed Dec 18 2024 19:17:30 GMT+0000 (Coordinated Universal Time)
వరద నీటితో కృష్ణా నది
కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి డ్యాం నిండిపోయింది. దీంతో లక్ష క్యూసెక్కుల నీటిని బయటకు వదిలిపెడుతున్నారు
గోదావరి తో పాటు ఇప్పుడు కృష్ణా నదికి కూడా వరదలు తప్పేట్లు లేవు, ఆల్మట్టి డ్యాం నుంచి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి డ్యాం నిండిపోయింది. దీంతో లక్ష క్యూసెక్కుల నీటిని బయటకు వదిలిపెడుతున్నారు. దీంతో నారాయణపూర్ ప్రాజెక్టులోని 12 గేట్లు ఎత్తివేశారు.
జూరాల ప్రాజెక్టుకు...
దీంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గోదావరితో పాటు కృష్ణా నదికి కూడా వరదలు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Next Story