Fri Jan 10 2025 08:09:38 GMT+0000 (Coordinated Universal Time)
బీచ్ లో నగ్నంగా తిరిగిన వ్యక్తి.. స్థానికుల గొడవతో ?
వెంటనే అతడి వద్దకెళ్లి.. ఇలా నగ్నంగా తిరుగుతున్నావేంటని నిలదీశారు. అతని తీరుపై మండిపడ్డారు. ”నువ్వెందుకు ఇలా..
గోవా.. ఈ టూరిస్ట్ ప్లేస్ తెలియనివారుండరు. దేశ, విదేశాల నుండి పర్యాటకులు గోవాకు వచ్చి రిలాక్స్ అవుతుంటారు. ప్రతి నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే బీచ్ ఏరియా ఇది. అలాంటి గోవా బీచ్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి గోవా బీచ్ లో నగ్నంగా తిరుగుతుండటంతో.. చూసిన వారంతా నివ్వెరపోయారు. గోవాలోని జీ-స్ట్రింగ్ థాంగ్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. ఓ విదేశీయుడు ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా తిరుగుతుండటంతో.. అక్కడి స్థానికులు విస్తుపోయారు.
వెంటనే అతడి వద్దకెళ్లి.. ఇలా నగ్నంగా తిరుగుతున్నావేంటని నిలదీశారు. అతని తీరుపై మండిపడ్డారు. ”నువ్వెందుకు ఇలా చేస్తున్నావ్? ఇది కరెక్ట్ కాదు. ఇది మా గ్రామం. ఇక్కడ మా పిల్లలు, మహిళలు నివాసం ఉంటారు. నువ్వు పూర్తిగా డ్రెస్ వేసుకోవాలి. రెండేళ్ల క్రితం కూడా నువ్వు ఇలానే నగ్నంగా బీచ్ లో తిరిగావు. మరోసారి ఇలా చేయను అని అప్పుడు చెప్పావు. కానీ, మళ్లీ అదే తప్పు చేశావ్. మీ యూరప్ లోనూ నువ్వు ఇలానే నూడ్ గా తిరుగుతావా? నువ్వు మాటలతో చెబితే వినవు. పోలీసులకు ఫోన్ చేస్తాను” అని స్థానికులు అనడంతో భయపడిన అతడు.. వెంటనే దుస్తులు వేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Next Story