Sat Nov 23 2024 00:13:02 GMT+0000 (Coordinated Universal Time)
ఇక్కడే కరోనా ... ఫోర్త్ వేవ్ కు సంకేతాలు?
మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగం మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి
మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగం మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. కొత్తగా మహారాష్ట్రంలో 4,024 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కరోనా కారణంగా మరణించారు. ఇప్పటికే రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20 వేలకు చేరువలో ఉంది. ఐదు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అధికంగా ముంబయి, పూనే, ఠానే నగరాల్లోనే ఈ కేసులు నమోదవుతున్నాయి.
ఢిల్లీలోనూ...
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ కేసుల సంఖ్య పెరుగుతుంది. నిన్న 1,375 మంది కరోనా బారిన పడ్డారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు ఏడు శాతానికి దాటింది. దేశ వ్యాప్తంగా ఎనిమిది వేలకు పైగా కేసులు నమోదవుతుంటే ఎక్కువగా మహారాష్ట్ర, ఢిల్లీలోనే కేసులు నమోదవుతున్నాయి. కేరళ, కర్ణాటకలోనూ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దీంతో ఈ రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది ఫోర్త్ వేవ్ కు సంకేతాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Next Story