Tue Dec 24 2024 12:25:17 GMT+0000 (Coordinated Universal Time)
అమెజాన్ 'ప్రైమ్ డే సేల్' త్వరలోనే.. వీటిపై ఆఫర్స్ ఉన్నాయంటే..?
అమెజాన్ 'ప్రైమ్ డే సేల్' త్వరలోనే మొదలుకాబోతోంది. భారతదేశంలో జూలై 23-జూలై 24 మధ్య అమెజాన్ ప్రైమ్ డే సేల్ నిర్వహించనున్నట్లు
అమెజాన్ రైమ్ డే సేల్ త్వరలోనే మొదలుకాబోతోంది. భారతదేశంలో జూలై 23-జూలై 24 మధ్య అమెజాన్ ప్రైమ్ డే సేల్ నిర్వహించనున్నట్లు ఇ-కామర్స్ వెబ్సైట్ ధృవీకరించింది. స్మార్ట్ఫోన్లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, టీవీలు, ఉపకరణాలు, ఫ్యాషన్ & బ్యూటీ, కిరాణా సామాగ్రి, అమెజాన్ పరికరాలు, ఇల్లు- వంటగదుల్లో ఉపయోగించే వస్తువులు, ఫర్నిచర్.. మరిన్నింటిపై అమెజాన్ డీల్‌లను అందించనుంది.
మిగిలిన వారికంటే.. ప్రైమ్ డే సేల్ ప్రత్యేకంగా అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రైబర్లకు ముందుగా అందుబాటులో ఉంటుంది. కొత్త సబ్స్క్రైబర్లను ఆకర్షించడానికి అమెజాన్ ప్రతి సంవత్సరం ప్రైమ్ డే సేల్‌ను నిర్వహిస్తుంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కు యాక్సెస్ అందించడమే కాకుండా, ప్రైమ్ సభ్యులకు ప్రత్యేక తగ్గింపులు, వేగవంతమైన డెలివరీ, ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు.
ప్రైమ్ డే సేల్ గురించి మాట్లాడుతూ.. అమెజాన్ ఇండియా డైరెక్టర్ అక్షయ్ సాహి మాట్లాడుతూ.. భారతదేశంలో మేము నిర్వహిస్తున్న ఆరో ప్రైమ్ డే సేల్.. ఈసారి మరింత గొప్పగా ఉండనుంది. మా ప్రైమ్ మెంబర్లందరికీ అద్భుతమైన షాపింగ్ వినోద అనుభవంతో నిండిపోనుంది. ఈ ప్రైమ్ డే సందర్భంగా అద్భుతమైన డీల్స్, కొత్త లాంచ్‌లు, బ్లాక్‌బస్టర్ వినోదాలతో ఆనందాన్ని పొందుతారని మేము భావిస్తున్నాము. అని చెప్పుకొచ్చారు.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 23 ఉదయం 12:00 గంటలకు ప్రారంభమై జూలై 24 రాత్రి 11:59 వరకు:
అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా, Samsung, Xiaomi, boAt, Intel, Lenovo, Sony, Bajaj, Eureka Forbes, Puma, Adidas, USPA, Max వంటి టాప్ ఇండియన్ & గ్లోబల్ బ్రాండ్ల నుండి 400కి పైగా టాప్ బ్రాండ్ల నుండి 30,000 కంటే ఎక్కువ కొత్త ఉత్పత్తి లాంచ్ చేయనున్నారు. Asics, Fastrack, Tresemme, Mamaearth, Surf Excel, Dabur, Colgate, Whirlpool, IFB వంటి బ్రాండ్స్ మరిన్ని ఉత్పత్తులను భారతదేశంలో అందుబాటులోకి తీసుకుని రానున్నాయి. ప్రైమ్ సబ్స్క్రైబర్లు స్మార్ట్ఫోన్లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్, టీవీలు, కిచెన్, రోజువారీ నిత్యావసర వస్తువులు, బొమ్మలు, ఫ్యాషన్, బ్యూటీ ప్రోడక్ట్స్ మరిన్నిటిపై యాక్సెస్ పొందుతారు. అమెజాన్ ఈ ప్రైమ్ డేలో Amazon Echo, Fire TV, Kindles పరికరాలపై ప్రత్యేకమైన డీల్‌లను అందించనుంది. స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ టీవీలు, ఫైర్ టీవీ ఉత్పత్తులు 55 శాతం వరకు తగ్గింపుతో అమ్మనున్నారు.
Next Story