Mon Dec 23 2024 01:28:49 GMT+0000 (Coordinated Universal Time)
యూజర్లకు మళ్లీ షాకిచ్చిన అమెజాన్.. భారీగా సబ్ స్క్రిప్షన్ల ధరలు పెంపు
కొత్తగా సబ్ స్క్రిప్షన్ తీసుకునే యూజర్ కు వన్ మంత్ ఫ్రీ ట్రైల్ ఆఫర్ చేస్తుంది. ఆ తర్వాత ఇష్టమైతే కంటిన్యూ అవ్వొచ్చు లేదా
ఏదైనా ఒక బిజినెస్ డెవలప్ అవ్వాలంటే.. ముందు ఆఫర్లు ఖచ్చితంగా ఉంటాయి. జియో మార్కెట్లో అలానే ప్రాచుర్యం పొందింది. ఫ్రీ సిమ్, ఫ్రీ కాల్స్, ఫ్రీ డేటా.. ఆఫర్లతో లక్షల యూజర్లను సొంతం చేసుకున్నాక ఏడాది తర్వాత.. నెలవారీ రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. క్రమంలో ఆ రీఛార్జ్ ధరలను పెంచుకుంటూ పోతోంది. ఇప్పుడు అమెజాన్ కూడా అదే బాటను అనుసరిస్తోంది అనడంలో సంశయం లేదు.
కొత్తగా సబ్ స్క్రిప్షన్ తీసుకునే యూజర్ కు వన్ మంత్ ఫ్రీ ట్రైల్ ఆఫర్ చేస్తుంది. ఆ తర్వాత ఇష్టమైతే కంటిన్యూ అవ్వొచ్చు లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెలకు, మూడు నెలలకు లేదా ఏడాది వరకూ సబ్ స్క్రిప్షన్ తీసుకోవచ్చు. మొదట్లో అమెజాన్ ప్రైమ్ వార్షిక ప్లాన్ ధర కేవలం రూ.500. కానీ, ఆ తర్వాత రూ.999 చేసింది. ఆ తర్వాత ఇది కాస్తా రూ.1,499 కు చేరింది. కానీ.. ఇప్పుడు ప్రైమ్ యూజర్లకు అమెజాన్ మరో షాకిచ్చింది. నెలవారీ, మూడు నెలల సబ్ స్క్రిప్షన్ ప్లాన్లను ఏకంగా 67 శాతం మేర పెంచేసింది.
ఇప్పుడు నెలవారీ అమెజాన్ ప్రైమ్ కోరుకునే వారు రూ.299 పెట్టి రీచార్జ్ చేసుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఇది రూ.179 గానే ఉంది. మూడు నెలలకు ఉన్న రూ.459 కాస్తా రూ.599కు పెంచేసింది. అయితే వార్షిక ప్లాన్లో మాత్రం మార్పు చేయలేదు. అది రూ.1499 గానే ఉంచింది. ఇప్పటి వరకూ ఉన్న యూజర్లకు 2024 జనవరి 15 వరకూ పాత ప్లాన్లే వర్తిస్తాయి. కొత్త యూజర్లకు, పాత ప్లాన్ రెన్యువల్ చేసుకోని యూజర్లకు మాత్రం కొత్తగా పెంచిన ధరలు వర్తిస్తాయి. వార్షిక సబ్ స్క్రిప్షన్లను పెంచుకునేందుకు అమెజాన్ నెల, మూడు నెలల ధరలను పెంచినట్లు తెలుస్తోంది.
Next Story