Sun Dec 22 2024 23:54:13 GMT+0000 (Coordinated Universal Time)
అతి పెద్ద సామ్రాజ్యానికి బిగ్ బాస్..?
అంబానీకి చెందిన ప్రముఖ సంస్థ రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ కు ఆయన కుమారుడు ఆకాష్ ను ఛైర్మన్ గా ఎంపిక చేయనున్నారు
వారసత్వాన్ని పారిశ్రామిక రంగంలో తీసుకురావడం సర్వ సాధారణమే. తన గైడెన్స్ లో వ్యాపార మెళుకువలు మరిన్ని తెలుసుకుంటారని బడా పారిశ్రామికవేత్తలు తొందరపడుతుంటారు. దాదాపు యాభై దశాబ్దాలు వ్యాపారంలో తలమునకై ఉన్న తనకు కొంత విశ్రాంతి అవసరమని భావించారో ఏమో ముకేష్ అంబానీ తన వారసుడికి పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. అంబానీకి చెందిన ప్రముఖ సంస్థ రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ కు ఆయన కుమారుడు ఆకాష్ ను ఛైర్మన్ గా ఎంపిక చేస్తారన్న వార్తలు వస్తున్నాయి.
అత్యంత విలువైన....
ముఖేష్ అంబానీకి చెందిన వ్యాపారసంస్థల్లో కెల్లా రిలయన్స్ అత్యంత విలువైనది. దీనికి ఆకాష్ అంబానీని ఛైర్మన్ గా చేయాలని నిర్ణయించారు. తన డైరెక్షన్ లోనే వారసుడు వ్యాపార మెళుకువలను నేర్చుకుంటారని భావిస్తున్నారు. అందుకే ఆకాష్ ను ఎంపిక చేయాలని నిర్ణయించారని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. చిన్న వయసులో అతి పెద్ద సామ్రాజ్యానికి బాస్ కాబోతున్నాడు ఆకాష్.
Next Story