Mon Dec 23 2024 03:01:15 GMT+0000 (Coordinated Universal Time)
ఒకే దేశం-ఒకే ఎన్నిక కమిటీ.. సభ్యులు వీళ్లే..!
కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్, వన్ ఎలక్షన్ కమిటీ సభ్యులను ప్రకటించింది
కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్, వన్ ఎలక్షన్ కమిటీ సభ్యులను ప్రకటించింది. ఈ కమిటీకి అధ్యక్షులుగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇక హై లెవల్ కమిటీలో సభ్యులుగా హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్కే సింగ్, సుభాష్ సింగ్ కశ్యప్, హరీష్ సాల్వే, సంజయ్ కొఠారీ ఉన్నారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరపాలని కేంద్రం నిర్ణయించడంతో అప్పటి నుంచీ దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ నడుస్తూ ఉంది. జమిలి ఎన్నికల కోసమే ఈ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి మోదీ "ఒక దేశం ఒకే ఎన్నికలు" ని సమర్థిస్తూ వస్తున్నారు. ఏకకాలంలో ఎన్నికలపై చర్చ జరిపి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని ప్రధాని పలు సందర్భాల్లో సూచించారు. 1967 వరకు, లోక్‌సభ- అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగేవి, అయితే కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత ఈ విధానం పక్కన పెట్టారు. ఇప్పుడు ఆ విధానాన్నే అమలు పరచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి జమిలీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’పై ఒక కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీ నివేదిక వస్తుంది, దానిపై చర్చ జరుగుతుందని అన్నారు.
Next Story