Mon Dec 23 2024 16:07:21 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎంపీ నవనీత్ కౌర్ దంపతులు అరెస్ట్.. ముంబై లో హైటెన్షన్
సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని చెప్పినందుకే తమను అరెస్ట్ చేయడంపై నవనీత్ కౌర్ దంపతులు ఆగ్రహం వ్యక్తం..
ముంబై : సీనియర్ నటి, అమ్రావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్ తో ముంబై లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హనుమాన్ చాలీసా వివాదమే వీరి అరెస్ట్ కు కారణమైంది. వివరాల్లోకి వెళ్తే.. హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాలని, లేకపోతే తామే సీఎం ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శివసేన శ్రేణులు నవనీత్ కౌర్ ఇంటి ముట్టడికి యత్నించారు.
సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని చెప్పినందుకే తమను అరెస్ట్ చేయడంపై నవనీత్ కౌర్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వారిద్దరినీ.. ఖార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ వారిని విచారిస్తున్నట్లుగా సమాచారం. తామేమీ ఉగ్రవాద చర్యలకు పాల్పడటం లేదని, సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని మాత్రమే చెబుతున్నామంటూ వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఎం నివాసం ముందు ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు అనుమతి లేదని పోలీసులు వారికి సర్దిచెప్పే యత్నం చేస్తున్నారు. నవనీత్ కౌర్ దంపతుల అరెస్ట్ తో ముంబై లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
Next Story