Fri Dec 20 2024 18:22:02 GMT+0000 (Coordinated Universal Time)
విమానాలకు బాంబు బెదిరింపులు
ముంబయి నుంచి న్యూయార్క్కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది
ముంబయి నుంచి న్యూయార్క్కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో దించేశారు. ముంబయి నుంచి బయలుదేరి విమానానికి గాల్లో ఉండగానే ఈ బెదిరింపులు రావడంతో వెంటనే అలెర్ట్ అయి విమానాన్ని దారి మళ్లించి ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసి తనిఖీలు చేస్తున్నారు. ఈ విమానంలో మొత్తం 239 మంది ప్రయాణికులున్నారు. అయితే తనిఖీల్లో ఎలాంటి బాంబు లేదని, ప్రయాణికులతో పాటు సిబ్బంది మొత్తం సురక్షితంగా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.
తనిఖీలు చేయగా...
ప్రయాణికులను దించేసి తనిఖీలు చేయడం ద్వారా న్యూయార్క్ కు వెళ్లాల్సిన విమానం లేట్ అయింది. ఈ విమానంతో పాటు మరో విమానానికి కూడా నేడు బాంబు బెదిరింపులు వచ్చాయి. ముంబయి నుంచి జెడ్డా విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దాన్ని కూడా ఎయిర్ పోర్టులో నిలిపివేసి తనిఖీలు చేశారు. అయితే ఇది ఆకతాయిలు చేసిన పనేనని ప్రాధమికంగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఇలాంటి బాంబు బెదిరింపులు రావడం, అవి ఉత్తుత్తివని తేలడంతో ఊపిరి పీల్చుకుంటున్నా ప్రయాణంలో ఆలస్యం మాత్రం జరుగుతుంది.
Next Story