Mon Dec 23 2024 02:32:43 GMT+0000 (Coordinated Universal Time)
విమానానికి బాంబు బెదిరింపు
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ముంబై నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి ఈ బెదిరింపు రావడంతో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిపి తనిఖీలు జరిపారు. ఉదయం ఎనిమిది గంటలకు తిరువనంతపురం విమానాశ్రయంలో ఐసొలేషన్ బేకు తనిఖీలు చేశారు.
తిరువనంతపురంలో...
విమానం నుంచి ప్రయాణిలకులను ఖాళీ చేయించి తనిఖీలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే తిరువనంతపురం రాగానే పైలెట్ కు బాంబు బెదిరింపు రావడంతో ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారన్నారు. విమానంలో 135 మంది ప్రయాణికులున్నారు. అయితే ఇది కావాలనే చేశారా? లేక నిజంగా అనేది తనిఖీల తర్వాత తేలనుంది.
Next Story