Mon Dec 23 2024 16:04:59 GMT+0000 (Coordinated Universal Time)
నేడు అఖిలపక్ష సమావేశం.. హాజరుకానున్న మోదీ
పార్లమెంటు సమావేశాల సందర్భంగా నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు.
పార్లమెంటు సమావేశాల సందర్భంగా నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షత వహిస్తారు. అన్ని పార్టీలతో ఈ సమావేశం మధ్యాహ్నం మూడు గంటలకు జరగనుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో సహకరించాలని ఈ సందర్భంగా అధికార పార్టీ కోరనుంది. అజెండా ప్రకారమే సభను నిర్వహిస్తామన్న హామీ ఇవ్వనుంది.
కీలక బిల్లులకు...
ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేంద్ర బడ్జెట్ ను ఆమోదించడంతో పాటు చర్చ సజావుగా సహకరించాలని మోదీ స్వయంగా కోరనున్నారు. దీంతో పాటు కీలక బిల్లుల ఆమోదానికి కూడా సహకరించాలని కోరనున్నారు.
Next Story