Sat Dec 21 2024 14:57:10 GMT+0000 (Coordinated Universal Time)
Earth Quake : హిమాచల్‌ప్రదేశ్ లో భూకంపం
హిమాచల్ ప్రదేశ్ భూకంపం సంభవించింది. చంబా జిల్లాల్లో నిన్న రాత్రి ఈ భూప్రకపంనలు కనిపించాయి
హిమాచల్ ప్రదేశ్ భూకంపం సంభవించింది. చంబా జిల్లాల్లో నిన్న రాత్రి ఈ భూప్రకపంనలు కనిపించాయి. రక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రతగా నమోదయింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. చంబా పట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలోని మనాలిలో ఈ భూప్రకంపనలు సంభవించాయి.
5.3 తీవ్రతగా...
రాత్రి 9.34 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఏడు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం ధాటికి ఎలాంటి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తినష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Next Story