Sat Dec 21 2024 00:30:15 GMT+0000 (Coordinated Universal Time)
చివరి నిమిషంలో మారిన ప్లాన్.. అదే మృత్యు దారిగా మారింది
చీఫ్ ఆఫ్ ఆర్మీ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ప్రారంభమయింది.
చీఫ్ ఆఫ్ ఆర్మీ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ప్రారంభమయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక విచారణ బృందం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుంది. ఎన్ని గంటలకు హెలికాప్టర్ వద్దకు బిపిన్ రావత్ చేరుకుంది? అంతకు ముందు సుల్లూరులో జరిగిన ఏర్పాట్లు వంటి అంశాలపై కూడా దర్యాప్తు ఆరా తీస్తుంది.
తొలుత రోడ్డు మార్గంలో....
ప్రమాదం జరగక ముందు ఏం జరిగిందన్న దానిపై విచారణ బృందం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. బిపిన్ రావత్ బృందం సుల్లూరు నుంచి వెల్లింగ్టన్ కు వెళ్లేందుకు రెండు మార్గాల్లో ఏర్పాటు చేసింది. ఒకటి హెలికాప్టర్ ద్వారా ప్రయాణించడం. రెండు రోడ్డు మార్గం ద్వారా. రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు ఎయిర్ ఫోర్స్ ప్రొటోకాల్ అధికారులు వాహనాలను కూడా సిద్ధం చేశారు. కాన్వాయ్ తో పాటు జడ్ కేటగిరి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. కానీ చివరి నిమిషంలో ప్లాన్ మారింది. హెలికాప్టర్ లోనే వెళ్లాలని నిర్ణయించుకుని బిపిన్ రావత్ బృందం ప్రమాదానికి గురైంది.
Next Story