Mon Dec 23 2024 00:04:59 GMT+0000 (Coordinated Universal Time)
నెలకొకటి చొప్పున.. 11 కోవిడ్ టీకాలు తీసుకున్న వృద్ధుడు
బీహార్ లోని మాధేపురా జిల్లా ఒరాయ్ ప్రాంతానికి చెందిన 84 ఏళ్ల వృద్ధుడైన బ్రహ్మదేవ్ మండల్ చేసిన ప్రకటన
బీహార్ లోని మాధేపురా జిల్లా ఒరాయ్ ప్రాంతానికి చెందిన 84 ఏళ్ల వృద్ధుడైన బ్రహ్మదేవ్ మండల్ చేసిన ప్రకటన స్థానిక అధికారయంత్రాంగం విస్తుపోయేలా చేసింది. ఇప్పటివరకూ తాను 11 కోవిడ్ టీకాలు తీసుకున్నట్లు బ్రహ్మదేవ్ ప్రకటించారు. 2021 ఫిబ్రవరిలో మొదటి డోసు తీసుకున్న ఆయన.. 2021 డిసెంబరు నాటికి 11 నెలల్లో 11 డోసులు తీసుకున్నట్లు వివరించారు. 12వ డోసు కూడా తీసుకునేందుకు ప్రయత్నించగా.. అది కాస్తా విఫలమైందట.
Also Read : కరోనాతో మరణిస్తే రూ.50 వేల పరిహారం.. !
12వ సారి టీకా తీసుకునేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే సరికి అక్కడ టీకాలు పూర్తవ్వడంతో టీకా తీసుకోలేకపోయినట్లు బ్రహ్మదేవ్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. టీకా తీసుకున్న ప్రతిసారి తాను ఏ తేదీన టీకా తీసుకున్నాడో బ్రహ్మదేవ్ ఒక పేపర్ పై నోట్ చేసుకున్నాడట. అతను చెప్పిన విషయాలు విన్న అధికారులు.. తొలుత విస్తుపోయినా కొద్దిసేపటికి తేరుకుని, బ్రహ్మదేవ్ పై విచారణ ప్రారంభించారు. ఒకరికి రెండు డోసుల టీకాలు వేస్తున్నారు. అదికూడా ఆధార్ నంబర్ తో రిజిస్టర్ చేసుకుని. మరి బ్రహ్మదేవ్ ఇన్నిసార్లు టీకాలు ఎలా తీసుకున్నాడన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది.
Next Story