Mon Dec 23 2024 03:51:42 GMT+0000 (Coordinated Universal Time)
కాలిన స్థితిలో ఉన్న ఓ మృతదేహం
స్థలం నుంచి భద్రతా దళాలు కాలిన స్థితిలో ఉన్న ఓ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి
జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో వరుసగా ఆరో రోజూ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఎన్కౌంటర్ స్థలం నుంచి భద్రతా దళాలు కాలిన స్థితిలో ఉన్న ఓ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అది ఉగ్రవాదిదే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఎన్కౌంటర్, సెర్చ్ ఆపరేషన్ 6వ రోజుకు చేరుకోవడంతో భద్రతా దళాలు సోమవారం జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఒక ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. శరీరంపై ఉన్న దుస్తుల ఆధారంగా, కాలిపోయిన మృతదేహం ఉగ్రవాదిదేనని భద్రతా దళ సిబ్బంది భావిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ పునఃప్రారంభించారు. మరొక ప్రదేశంలో డ్రోన్ ద్వారా ఒక సైనికుడిని, మరొక ఉగ్రవాది మృతదేహాలను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఎన్కౌంటర్ ఐదవ రోజైన ఆదివారం కూడా ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. సోమవారం నుంచి ఇప్పటివరకు ఎలాంటి కాల్పులు జరగలేదు. ఈ ఎన్కౌంటర్లో నలుగురు భద్రతాధికారులు అమరులయ్యారు. వీరిలో 19 రాష్ట్రీయ రైఫిల్స్ కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్, జమ్మూకశ్మీర్ డీఎస్పీ మేజర్ ఆశిష్ ధోంచక్, డీఎస్పీ హుమయూన్ భట్, మరో సైనికుడు అమరులయ్యారు. దాక్కుని ఉన్న తీవ్రవాదులను అంతం చేయాలని భద్రతా బలగాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి.
Next Story