Mon Dec 23 2024 03:18:48 GMT+0000 (Coordinated Universal Time)
లష్కరే తోయిబా కమాండర్ హతం
జమ్మూకశ్మీర్ లోని అనంత నాగ్ జిల్లాలో గత వారం ప్రారంభమైన ఎన్ కౌంటర్ ఎట్టకేలకు
జమ్మూకశ్మీర్ లోని అనంత నాగ్ జిల్లాలో గత వారం ప్రారంభమైన ఎన్ కౌంటర్ ఎట్టకేలకు ముగిసింది. లష్కరే తోయిబా స్థానిక కమాండర్ ఉజైర్ ఖాన్ ను భద్రతా దళాలు హతమార్చాయి. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి భారత భద్రతా బలగాలు. మరో ఉగ్రవాది మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్ కౌంటర్ ముగిసింది కానీ ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతుందని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. అనంత్ నాగ్ జిల్లాలోని గారోల్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. లష్కరే తోయిబా స్థానిక కమాండర్ ఉజైర్ ఖాన్ ను అంతం చేసే సమయంలో 19 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మరో మేజర్ ఆశిష్ దోంచక్, డీఎస్పీ కేడర్ లో ఉన్న జమ్మూకశ్మీర్ పోలీస్ అధికారి హుమాయిన్ భట్, ఆర్మీ జవాను ప్రదీప్ ప్రాణాలు కోల్పోయారు. ఎన్ కౌంటర్ జరిగిన అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని ఏడీజీపీ విజయ్ కుమార్ స్థానికులను కోరారు. “లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాము. మరో ఉగ్రవాది శవం లభ్యమైంది. అనంత్నాగ్ ఎన్కౌంటర్ ముగిసింది" అని ఏడీజీపీ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. సోమవారం నాడు అటవీ ప్రాంతంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఒకరిని ఉగ్రవాదులు హతమార్చిన జవాను ప్రదీప్గా గుర్తించారు.
Next Story