Mon Dec 23 2024 05:00:46 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు వివిధ శాఖలపై సమీక్షను నిర్వహించనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు వివిధ శాఖలపై సమీక్షను నిర్వహించనున్నారు. చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం12 గంటలకు సచివాలయానికి రానున్నారు. గ్రామీణ నీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ మీద సమీక్ష చేయనున్నారు. అనంతరం సెర్ఫ్ మీద సమీక్ష చేస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఉచిత ఇసుక విధానం పోర్టల్‌ను...
మధ్యాహ్నం ఉచిత ఇసుక విధానంలో పోర్టల్ ను చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. తర్వాత ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్, రిలేషన్స్ పై సమీక్షను నిర్వహించనున్నారు. యంత్రం 6 గంటలకు వెలగపూడి సచివాలయం సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ ను చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. నేడు మరికొన్ని అన్నా క్యాంటిన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు.
Next Story