Sat Dec 21 2024 02:08:39 GMT+0000 (Coordinated Universal Time)
అంజలి రోడ్డుప్రమాదం కేసు : వెలుగులోకి డ్రగ్స్ కేసు
ప్రమాదం జరిగిన సమయంలో అంజలి మద్యం సేవించి ఉందని నిధి పోలీసులకు తెలుపగా.. పోస్టుమార్టమ్ రిపోర్టులో..
దేశమంతా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వేళ.. దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 1 తెల్లవారుజామున జరిగిన ఓ రోడ్డుప్రమాదం యావత్ దేశాన్నీ ఉలిక్కిపడేలా చేసింది. స్కూటీపై వెళ్తోన్న అంజలి సింగ్ (20) అనే యువతిని ఒక కారు ఢీ కొట్టి.. 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో అంజలి తీవ్ర గాయాలపాలై.. శరీరం ఛిద్రమై అక్కికక్కడే మృతి చెందింది. కాగా.. అంజలి ప్రమాదానికి గురికాక ముందు ఎక్కడి నుండి బయల్దేరిందని ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో.. ఓ హోటల్ వద్ద రికార్డైన సీసీటీవీ ఫుటేజీలో అంజలితో మరో యువతి కూడా స్కూటీపై వెళ్లినట్లు గుర్తించారు.
ఆ యువతిని నిధిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో అంజలి మద్యం సేవించి ఉందని నిధి పోలీసులకు తెలుపగా.. పోస్టుమార్టమ్ రిపోర్టులో అలాంటి విషయాలేమీ వెల్లడికాలేదు. తాజాగా.. ఈ కేసులో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. 2020 డిసెంబరులో నిధి తెలంగాణ నుండి ఢిల్లీకి 30 కేజీల గంజాయిని రవాణా చేస్తూ.. ఆగ్రా రైల్వే స్టేషన్లో పట్టుబడింది. ఈ కేసులో నిధి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. మృతురాలు అంజలి కుటుంబానికి బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ అండగా నిలిచారు. షారుక్ రన్ చేస్తున్న మీర్ ఫౌండేషన్ తరపున అంజలి తల్లి, తోబుట్టువులకు ఆర్థిక సహాయం అందించారు. అయితే ఎంతమొత్తం సహాయం చేశారన్న వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు.
Next Story