Mon Dec 23 2024 20:16:50 GMT+0000 (Coordinated Universal Time)
మరో చిరుత మృతి
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి చెందింది.
వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ సుప్రీంకోర్టులో శుక్రవారానికి వాయిదా పడింది. ఐదుగురు న్యాయమూర్తులకు కరోనా సోకడంతో ఈ విచారణను వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత వేసిన పిటీషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ చేయాల్సి ఉంది.
ఈ నెల 28న తిరిగి....
ఈరోజు వరకూ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈరోజు తీర్పు వచ్చే అవకాశముందని భావించి పులివెందులలోనూ భారీ ఎత్తున పోలీసులు మొహరించారు. వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు, న్యాయవాదులకు కరోనా సోకడంతో ఈ కేసును ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసినట్లు ప్రకటించారు.
Next Story