Thu Dec 26 2024 20:52:18 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో మరో మంకీ పాక్స్ కేసు
ఢిల్లీలో మరో మంకీ పాక్స్ కేసు నమోదయింది. 31 ఏళ్ల మహిళకు మంకీపాక్స్ సోకినట్లు వైద్యులు ధృవీకరించారు
ఢిల్లీలో మరో మంకీ పాక్స్ కేసు నమోదయింది. 31 ఏళ్ల మహిళకు మంకీపాక్స్ సోకినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య 9కి చేరింది. ఢిల్లీలో మూడు మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. వీరికి ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తాజాగా మంకీ పాక్స్ సోకిన మహిళ నైజీరియాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పశ్చిమ ఢిల్లీ ప్రాంతంలో నివసిస్తున్న మహిళకు మంకీపాక్స్ సోకడంతో లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి తరలించారు.
కేసుల సంఖ్య...
దేశంలో మంకీ పాక్స్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. అన్ని రాష్ట్రాల్లో దీనికి అవసరమైన ఆసుపత్రుల్లో ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఢిల్లీలో మాత్రం లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రుల్లో ఇప్పటికే 20 ఐసొలేషన్ రూంలను ఏర్పాటు చేసింది. మిగిలిన ఆసుపత్రుల్లోనూ ఈ గదులు ఏర్పాటయ్యాయి. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది.
Next Story