Fri Dec 20 2024 18:56:41 GMT+0000 (Coordinated Universal Time)
నితీష్ కుమార్ కు మరో ఎదురుదెబ్బ
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. డామన్ డయ్యూ లో జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన పదిహేను మంది జిల్లా పంచాయతీ సభ్యులు ఆ పార్టీని వీడారు. వారంతా భారతీయ జనతా పార్టీలో చేరారు. దీంతో జిల్లా పంచాయతీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
వరసగా....
బీహార్ లో నితీష్ కుమార్ బీజేపీని వీడి ఆర్జేడీ, కాంగ్రెస్ పంచన చేరిన తర్వాత రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అందులో భాగంగానే ఇటీవల మణిపూర్ అసెంబ్లీలో ఆరుగురు సభ్యులున్న జేడీయూలో ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీ లో చేరిపోయారు. ఇప్పుడు డామన్ డయ్యూలోనూ పంచాయతీ సభ్యులు బీజేపీ లో చేరిపోయారు.
Next Story