Mon Dec 23 2024 15:24:54 GMT+0000 (Coordinated Universal Time)
కూలిన ఆర్మీ హెలికాప్టర్.. అక్కడికి వెళ్ళడానికి రోడ్డు కనెక్టివిటీ కూడా లేదు
అరుణాచల్ ప్రదేశ్‌లో ఇవాళ ఆర్మీ హెలికాప్టర్ కూలింది. అప్పర్ సియాంగ్ జిల్లాలోని టూటింగ్ హెడ్‌క్వార్టర్స్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో ఆ హెలికాప్టర్ కూలినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ కూలిన ప్రదేశం రోడ్డు మార్గం లేదు. ఆ ప్రాంతానికి రెస్క్యూ బృందాన్ని పంపినట్లు అధికారులు తెలిపారు. కూలిన విమానాన్ని హెచ్ఏఎల్ రుద్రగా గుర్తించారు. ట్యూటింగ్ ప్రధాన కార్యాలయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రోడ్డు ద్వారా వెళ్ళడానికి వీలవ్వకపోవడంతో.. రెస్క్యూ టీం కార్యకలాపాలను నిర్వహించడం కష్టమవుతోంది. రుద్ర హెలికాప్టర్ భారత సైన్యం కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేసింది. ఇది ధృవ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ALH) కు చెందిన వెపన్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ (WSI) Mk-IV వేరియంట్.
"A military chopper crashed near Singging village, 25 kms away from the Tuting headquarters in the Upper Siang district today. Site of accident not connected by road, rescue team sent. Further details awaited," అంటూ డిఫెన్స్ PRO చెప్పినట్లుగా ANI నివేదించింది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, "అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇండియన్ ఆర్మీ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ క్రాష్ గురించి వచ్చిన వార్తలు తమను కలవరపెడుతూ ఉన్నాయి" అని ట్వీట్లో తెలిపారు.
Next Story