Tue Dec 24 2024 16:11:35 GMT+0000 (Coordinated Universal Time)
హెలికాప్టర్ లో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ తమిళనాడులో ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్ ఈ హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నట్లు ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. హెలికాప్టర్ లో చనిపోయిన నలుగురు ఎవరు అన్నది కూడా తెలియలేదు. మొత్తం తొమ్మిది మంది ఆర్మీ ఉన్నతాధికారులు హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీరి జాబితాను కూడా ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. హెలికాప్టర్ లో బిపిన్ రావత్ భార్య మధులిక రావత్ కూడా ఉన్నారు.
కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం...
కాసేపట్లో పార్లమెంటులో రాజ్ నాధ్ సింగ్ ప్రకటన చేయబోతున్నారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంతో కేంద్ర మంత్రివర్గం అత్యవసర సమావేశం జరిగింది. ప్రమాదం పై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై మంత్రి వర్గం చర్చిస్తుంది. అధికారులతో మాట్లాడుతుంది. కుట్రకోణం ఏదైనా ఉందా? వాతావరణం అనుకూలించక కూలిపోయిందా? అన్న దానిపై చర్చిస్తున్నారు.
Next Story