Mon Dec 23 2024 06:04:14 GMT+0000 (Coordinated Universal Time)
త్రివిధ దళాల ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు
త్రివిధ దళాల ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు జరుగుతున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌకలో ఘనంగా యోగా దినోత్సవాన్ని..
జూన్ 21, 2014లో యోగా దినోత్సవం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ప్రధాని నరేంద్రమోదీ న్యూయార్క్ లో జరిగే యోగా వేడుకల్లో పాల్గొనున్నా. ఈ వేడుకలకు పలు దేశాల రాయబారులు, ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక భారత్ లో ఉదయం నుంచే యోగా వేడుకలు ప్రారంభమయ్యాయి. త్రివిధ దళాల ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు జరుగుతున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌకలో ఘనంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించగా.. రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రత్యేక అతిథిగా హాజరై.. యోగాసనాలు వేశారు.
ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకటే భవిష్యత్తు నినాదంతో 19 యుద్ధనౌకలు, 3500 మంది సిబ్బందితో యోగా డే వేడుకలు జరగనున్నాయి. 11 పోర్టులు, 11 సరిహద్దు ప్రాంతాల్లోనూ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. 106 ప్రదేశాల్లో భారత్ మాల ఆకృతిలో యోగా చేయాలని ఆర్మీ నిర్ణయించింది. సియాచిన్, కన్యాకుమారి, అండమాన్ లలో సైనికులు యోగాసనాలు వేయనున్నారు. ఆయా రాష్ట్రాల్లో జరగనున్న యోగా దినోత్సవ వేడుకలకు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. భారత్ లో మాత్రమే కాకుండా.. బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, కెన్యా, మడగాస్కర్, ఒమన్, శ్రీలంక, థాయ్ లాండ్, దుబాయ్ హార్బర్ల లోనూ నౌకాదళ సిబ్బంది యోగాసనాలు వేశారు.
Next Story