Tue Dec 24 2024 17:14:18 GMT+0000 (Coordinated Universal Time)
గణేష్ నవరాత్రోత్సవాల్లో అపశృతి.. డ్యాన్స్ చేస్తూ వ్యక్తి మృతి
అక్కడ చేస్తున్న భజనకు అనుగుణంగా డ్యాన్స్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత రవిశర్మ మండపంపై భక్తులు కూర్చొన్న చోట..
దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఓ ప్రాంతంలో జరుగుతున్న వినాయకచవితి ఉత్సవాల్లో అపశృతి జరిగింది. గణేష్ మండపంలో నిర్వహించిన భజనలో హనుమంతుడి వేషం వేసిన కళాకారుడు డ్యాన్స్ చేస్తూ.. ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురి జిల్లాలో జరిగింది. కొత్వాలి ప్రాంతంలోని శివాలయంలో వినాయకచవితి వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ బృందానికి చెందిన రవివర్మ అనే కళాకారుడు ఆంజనేయుడి వేషం వేసి.. అందరినీ ఆకట్టుకున్నాడు.
అక్కడ చేస్తున్న భజనకు అనుగుణంగా డ్యాన్స్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత రవిశర్మ మండపంపై భక్తులు కూర్చొన్న చోట కుప్పకూలిపోయాడు. అయితే తొలుత భక్తులు ఇదంతా భజన, డ్యాన్స్లో భాగంగా అంతా అనుకున్నారు. హనుమంతుడు వేషం వేసిన రవి శర్మ చాలా సేపటి వరకు పైకి లేవలేదు. గమనించిన మండపం నిర్వాహకులు అతడ్ని వెంటనే మెయిన్పురి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు చెప్పడంతో.. మండపంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story