Thu Mar 27 2025 07:26:59 GMT+0000 (Coordinated Universal Time)
Elections Result : నేడు రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.

అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇప్పటికే అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి లెక్కింపు జరగనుంది. అరవై స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ లో పది చోట్ల ఇప్పటికే బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన యాభై స్థానాలకు ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం 133 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
మధ్యాహ్నానికి...
ఇక సిక్కింలోనూ ఈ రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సిక్కింలో 80 శాతం పోలింగ్ నమోదయింది. 146 మంది అభ్యర్థులు బరిలో ఉన్నాు. అయితే ఈసారి సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్, బీజేపీ, కాంగ్రెస్, సిటిజన్ యాక్షన్ పారేట సిక్కింలు అధికారంలోకి రావాలని ఆరాట పడుతున్నాయి. మధ్యాహ్నానికి ఈ రెండు రాష్ట్రాల్లో గెలుపు ఎవరన్నది తెలియనుంది. కౌంటింగ్ సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Next Story