Sun Dec 22 2024 15:31:25 GMT+0000 (Coordinated Universal Time)
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆప్ అధినేత 90 రోజుల జైలు శిక్ష అనుభవించారు. ఈ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో కేజ్రీవాల్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కూడా అరెస్టు చేసినందున తీహార్ జైలులోనే ఉన్నారు. 2021-22 సంబంధించిన మద్యం పాలసీ కేసులో మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఆ తర్వాత జూన్ 2న తిరిగి కోర్టులో లొంగిపోయారు.
Next Story