Mon Dec 23 2024 11:24:55 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ
ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వీకెండ్ లో ఢిల్లీలో కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు
ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వీకెండ్ లో ఢిల్లీలో కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. ప్రతి శని, ఆదివారాల్లో ఢిల్లీల్లో కర్ఫ్యూ విధించాలని ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని నిర్ణయిచింది. ప్రయివేటు సంస్థలు యాభై శాతం మందితోనే పనులు చేసుకోవాలని కోరింది.
కరోనా కేసులు....
ఢిల్లీలో కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే సినిమాహాళ్లు, మాల్స్ , పాఠశాలలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. నైట్ కర్ఫ్యూ ను అమలు చేస్తున్నారు. ఇక తాజాగా శని, ఆదివారాల్లో కర్ఫ్యూ విధించాలని నిర్ణయించడం కోవిడ్ ను నియంత్రించడంలో భాగమేనని ప్రభుత్వం చెబుతోంది.
Next Story