Mon Dec 23 2024 10:53:47 GMT+0000 (Coordinated Universal Time)
Aravind Kejrival : నేడు ముఖ్యమంత్రి రాజీనామా?
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ నేడు రాజీనామా చేయనున్నారు. ఈరోజు ఆయన లెఫ్ట్నెంట్ గవర్నర్ ను కలవనున్నారు
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ నేడు రాజీనామా చేయనున్నారు. ఈరోజు ఆయన లెఫ్ట్నెంట్ గవర్నర్ ను కలవనున్నారు. ఆయనను కలసి రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. ఇటీవల కేజ్రీవాల్ తాను రెండురోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలుకు వెళ్లి బెయిల్ పై తిరిగి వచ్చిన కేజ్రీవాల్ తనపై అక్రమ కేసులు మోపారని, నిర్దోషిగా బయటపడిన తర్వాతనే ముఖ్యమంత్రి బాధ్యతలను చేపటతానని ఆయన సవాల్ విసిరారు.
కొత్త ముఖ్యమంత్రిగా...
లెఫ్ట్నెంట్ గవర్నర్ ను కలవడానికి ముందు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈసమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయనున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళతామని కేజ్రీవాల్ ప్రకటించడంతో ఎన్నికలు జరిగేంత వరకూ వేరే వారు ముఖ్యమంత్రిగా ఉంటారని కేజ్రీవాల్ ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీ నూతన సీఎం ఎవరన్న దానిపై చర్చ జరగుతుంది. పలు పేర్లు వినిపిస్తున్నా ఇంకా కేజ్రీవాల్ ఎవరి పేరును ఖరారు చేయలేదు. నవంబరులో మహారాష్ట్రతో పాటు ఎన్నికలు జరపాలని కేజ్రీవాల్ కోరారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామాతో మరోసారి హస్తిన రాజకీయాలు వేడెక్కనున్నాయి.
Next Story