Fri Dec 20 2024 01:10:32 GMT+0000 (Coordinated Universal Time)
Karnataka results : రాహుల్ అన్ స్టాపబుల్
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నెలకొంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నెలకొంది. కర్ణాటక ఎన్నికల్లో ఒంటరిగా అధికారంలోకి వచ్చే దిశగా ఫలితాలు వస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొని ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఈరోజు అన్ స్టాపబుల్ అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. రాహుల్ గాంధీ పాదయాత్ర కర్ణాటకలో జరిగిన తర్వాత సీన్ మారిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
హనుమాన్ దేవాలయంలో...
అటు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిమ్లాలోని హనుమాన్ మందిరానికి వెళ్లిన ప్రియాంక అక్కడ పూజల్లో పాల్గొన్నారు. ఈ వీడియోనూ హస్తం పార్టీ షేర్ చేసింది. కాంగ్రెస్ నేతలు ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రెబల్ అభ్యర్థులతో టచ్లోకి వెళ్లారు. ఆధిక్యంలో ఉన్న స్వత్రంత ఎమ్మెలేలతో కూడా డీకే మాట్లాడుతున్నారు.
Next Story