Wed Mar 26 2025 20:58:01 GMT+0000 (Coordinated Universal Time)
పక్కా ప్రణాళికతోనే తనపై దాడి.. అసోం సీఎం
హైదరాబాద్ గణేష్ నిమజ్జన వేడుకల్లో పక్కా ప్రణాళికతోనే తనపై దాడి జరిగిందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు.

హైదరాబాద్ గణేష్ నిమజ్జన వేడుకల్లో పక్కా ప్రణాళికతోనే తనపై దాడి జరిగిందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. తన ప్రసంగాన్ని అడ్డుకుందామనే టీఆర్ఎస్ నేత వేదికపైకి వచ్చారన్నారు. తన మైకును లాక్కునే ప్రయత్నం చేశారని తెలిపారు. అయినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. తాను మాట్లాడకముందే తన వెనకే వేదికపైకి ఆ వ్యక్తి వస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆయన తెలిపారు.
కేంద్రానికి ఫిర్యాదు చేయను....
చాలా సార్లు రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని తెలిపారు. ఒకసారి తన పర్యటనకు అనుమతి ఇచ్చాక ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలని హిమంత బిశ్వశర్మ అన్నారు. ఈ ఘటనపై తాను కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఫిర్యాదు చేయబోనని ఆయన తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని ఆయన అన్నారు. కొత్త పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చని, కానీ కేసీఆర్ వల్ల బీజేపీ జరిగే నష్టం ఏమీ ఉండదని ఆయన అన్నారు.
Next Story