Mon Dec 23 2024 07:29:02 GMT+0000 (Coordinated Universal Time)
ఇది కదా నిజమైన ప్రేమంటే.. చనిపోయిన ప్రియురాలిని పెళ్లాడి ఇకపై..
ఒక పార్వతీ-దేవదాసు, ఒక లైలా- మజ్ను, ఒక సలీం-అనార్కలీ.. ఈ జంటలన్నీ ప్రేమకు నిలువెత్తు నిదర్శనమని చెప్తుంటారు.
ఈ రోజుల్లో ప్రేమకు అర్థం లేకుండా పోతోంది. కొందరు ప్రే అంటే ప్రేమించడం.. మ అంటే మరిచిపోవడం అనుకుంటే.. మరికొందరు ప్రేమ పేరుతో ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. ప్రేమించిన వారిని చంపేస్తున్నారు. కానీ.. ఓ యువకుడు తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలన్న తన ఆశ మధ్యలోనే ఆవిరై పోవడంతో కుంగిపోయాడు. ప్రేయసి మృతదేహంపై పడి గుండెలవిసేలా రోధించాడు. ప్రేయసి మృతదేహానికి తాళి కట్టి.. ఇక జీవితంలో ఎప్పటికీ పెళ్లిచేసుకోనని శపథం చేశాడు. ఈ ఘటన అసోంలోని మోరిగావ్ జిల్లాలో జరిగింది.
ఒక పార్వతీ-దేవదాసు, ఒక లైలా- మజ్ను, ఒక సలీం-అనార్కలీ.. ఈ జంటలన్నీ ప్రేమకు నిలువెత్తు నిదర్శనమని చెప్తుంటారు. కానీ వారంతా ప్రేమకోసం ప్రాణాలు తీసుకున్నారు. ఈ యువకుడు తన ప్రేమకోసం చనిపోయిన ప్రియురాలిని పెళ్లాడాడు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలని కోరుకున్న యువతి అర్ధాంతరంగా చనిపోవడం తట్టుకోలేకపోయాడు. మోరిగావ్కు చెందిన బిటుపన్ తములి, కౌసువ గ్రామానికి చెందిన 24 ఏళ్ల ప్రాథనా బోరా ప్రేమించుకున్నారు.
ఇటీవల అనారోగ్యానికి గురైన ప్రాథనా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిని ఆమె కుటుంబీకుల ముందే పెళ్లాడాడు. అచేతనంగా పడి ఉన్న ఆమెకు తాళి కట్టాడు. ప్రేయసి నుదిటిపై కుంకుమ పెట్టి.. దండ వేశాడు. ఇక జీవితంలో ఎవరినీ వివాహం చేసుకోనని.. ఒంటరిగానే ఉంటానని శపథం చేశాడు. ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో.. ఇది కదా నిజమైన, స్వచ్ఛమైన ప్రేమ అని బిటుపన్ ను ప్రశంసిస్తున్నారు.
Next Story