Assembly Elections: ఎన్నికలకు ముందు అభ్యర్థి మరణిస్తే పోలింగ్ జరుగుతుందా?
తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణతో పాటు మరి కొన్ని రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్..
తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణతో పాటు మరి కొన్ని రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే తెలంగాణలోని నిజామాబాద్ అర్బన్ స్థానంలో అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ పార్టీకి చెందిన అభ్యర్థిగా కన్నయ్య గౌడ్ నామినేషన్ వేశారు. ఆయన వయసు 30 ఏళ్లు. అయితే నవంబర్ 18న ఆయన మృతి చెందగా, రాజస్థాన్‌లో కూడా ఓ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థి కూడా మరణించాడు.
రాజస్థాన్‌లో 200 నియోజకవర్గాలు ఉండగా, ఆయన మరణంతో 199 నియోజకవర్గాలకు మాత్రమే నవంబర్ 25న పోలింగ్ జరిగింది. శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ జరగడం జరగలేదు. ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గుర్గుమీత్ సింగ్ కున్నార్ నవంబర్ 15 మరణించారు. మరి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి మరణిస్తే ఆ నియోజకవర్గానికి ఎన్నికలు వాయిదా పడతాయా? అన్న అనుమానం తలెత్తుతోంది.
కొత్త నిబంధన ఏమి చెబుతుంది?
ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 52 ప్రకారం, గుర్తింపు పొందిన రాష్ట్రం లేదా జాతీయ పార్టీ ద్వారా పోటీ చేసిన అభ్యర్థి నామినేషన్ తర్వాత లేదా ఓటు వేయడానికి ముందు మరణిస్తే, ఆ సీటుపై ఓటింగ్ వాయిదా వేయాలి. కొన్ని రోజుల తర్వాత, ఓటింగ్ కోసం కొత్త తేదీని ప్రకటించాలి. ఇంతకుముందు స్వతంత్ర అభ్యర్థి మరణించినప్పుడు కూడా ఇది జరిగేది. కానీ తరువాత ఆ నిబంధనకు సవరణ చేశారు. ఈ నియమం గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థుల మరణానికి మాత్రమే ఇది వర్తిస్తుందని చట్టం చెబుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం అంటే ఏమిటి?
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 52 (2) ప్రకారం.. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి ఒక నియోజకవర్గంలో ఓటు వేయకముందే మరణిస్తే, ఎన్నికల సంఘం ఆ రాజకీయ పార్టీని నామినేట్ చేసి మరో అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వాలని కోరుతుంది. ఆ తర్వాత ఎన్నికలు వాయిదా పడి కొత్త ఓటింగ్ తేదీని ప్రకటిస్తారు. కరణ్‌పూర్ సీటుపై కూడా అదే జరిగింది. ఇక్కడ ఎన్నికల పోలింగ్ నవంబర్ 25న జరగాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ అభ్యర్థి మరణంతో అది వాయిదా పడింది. ఓటింగ్ కోసం కొత్త తేదీని ప్రకటించనున్నారు ఎన్నికల అధికారులు.