Thu Dec 26 2024 06:00:59 GMT+0000 (Coordinated Universal Time)
Sabarimala : 6.65 లక్షల కంటైనర్లలో ఉన్న కోట్ల విలువైన ప్రసాదం పనికి రాదట
కేరళలోని శబరిమల ఆలయంలో ప్రసాదం అంటే అయ్యప్ప భక్తులకు ఎంతో ఇష్టం. ఆ ప్రసాదాన్ని అత్యంత ఇష్టంగా స్వీకరిస్తారు.
కేరళలోని శబరిమల ఆలయంలో ప్రసాదం అంటే అయ్యప్ప భక్తులకు ఎంతో ఇష్టం. ఆ ప్రసాదాన్ని అత్యంత ఇష్టంగా స్వీకరిస్తారు. శబరిమలలో వీటిని ప్రత్యేకంగా తయారు చేసిన డబ్బాల్లో అయ్యప్పలకు అందిస్తారు. అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు శబరిమలకు వెళ్లి వచ్చిన తర్వాత తిరిగి పూజలు నిర్వహించి అయ్యప్ప ప్రసాదాన్ని చాలా మందికి పంచి పెడుతుంటారు. అయితే ఈ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు సంచలనం రేపాయి. దీనిని అరవణ అని పిలుస్తారు. ఈ ప్రసాదంలో మోతాదుకు మించి క్రిమిసంహారకాలు ఉన్నట్లు గుర్తించిన ట్రావెన్ కోర్ దేవస్థానం ఈ మేరకు చర్యలు ప్రారంభించింది.
గత ఏడాది నిల్వ చేసిన...
మొత్తం 6.65 లక్షల కంటైనర్లలో ప్రసాదం ఉంది. ఈ ప్రసాదం నిల్వ ఉంది. గత ఏడాది అయ్యప్ప మాల సందర్భంగా తయారు చేసింది. అయితే ఇందులో కల్తీ జరిగినట్లు నిర్ధారణ కావడంతో ప్రసాదాన్ని ఏం చేయాలన్న దానిపై ఆలయ కమిటీ సభ్యులు మల్లగుల్లాలు పడ్డారు. ప్రసాదాన్ని పారవేయకూడదు. అలా చేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. దీంతో ఇంత పెద్ద మొత్తంలో ప్రసాదాన్ని ఏం చేయాలన్న దానిపై నిపుణులతో చర్చించారు. అనంతరం ఒక నిర్ణయానికి వచ్చారు.
ఎరువుగా మార్చి....
గత ఏడాది తయారు చేసిన ప్రసాదం నిల్వ ఉంచింది కావడంతో ఇక భక్తులకు పంపిణీ చేయకూడదని నిర్ణయించుకున్న ట్రావెన్ కోర్ దేవస్థానం దానిని ఎరువుగా మార్చాలని నిర్ణయించింది. ప్రసాదం తయారీలో యాలకులు వినియోగించకుండా యాలకుల్లో మోతాదును మించిన క్రిమిసంహారకాలు కలిసినట్లు తేలడంతో దీనిని శాస్త్రీయంగా పారబోసేందుకు నిర్ణయించింది. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్ ను ఇండియాన్ సెంట్రిఫ్యూజ్డ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ దక్కించుకుంది. వీరు ఈ కలుషితమైన ప్రసాదాన్ని ఎరువుగా మార్చనున్నారు. భగవంతుడి ప్రసాదాన్ని ఏదో రూపంలో సద్వినియోగం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కొట్టాయంలోని గూడెంకు అప్పగించారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు తీసుకెళ్లి ఎరువుగా మార్చనున్నారు. దీనివిలువ కోట్ల రూపాయలు ఉంటుందని బోర్డు సభ్యులు తెలిపారు.
Next Story