Vajpayee : ఇద్దరు వేర్వేరు కాదు.. ఇద్దరి స్నేహం అంత బలమైనది
అటల్ బిహారీ వాజ్ పేయి, లాల్ కృష్ణ అద్వానీ వేర్వేరు కాదు.
అటల్ బిహారీ వాజ్ పేయి, లాల్ కృష్ణ అద్వానీ వేర్వేరు కాదు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలు కాకపోయినా వారిద్దరూ సోదరులుగా భావించేవారు. ఆ మాటకు వస్తే ఇద్దరూ ఒక దేశ పౌరులు కాదు. కానీ వారి మధ్య గల అనుబంధాన్ని అందరూ గుర్తు చేసుకుంటారు. ఈరోజు వాజ్ పేయి శతజయంతి సందర్భంగా ఇద్దరు అగ్రనేతల స్నేహాన్ని ఒకసారిగుర్తుకు తెచ్చుకుందాం. రాజకీయాల్లో మెలిగే వారికి వీరు ఒక దిక్సూచి అని చెప్పాలి. వారి స్నేహానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఒకరు మితవాది. మరొకరు అతివాది. అయినప్పటికీ ఒకరంటే మరొకరికి అపరిమితమైన గౌరవం, ప్రేమ, అభిమానం. ఒకరి అభిప్రాయాలు, మరొకరి అభిప్రాయాలు వేర్వేరు కావచ్చు. అంతమాత్రాన వారు విభేదించుకోలేదు. వ్యక్తిగత జీవితంలో, రాజకీయ ప్రయాణంలో పరిణితిని ప్రదర్శించారు. పరస్పరం అర్థం చేసుకున్నారు. అందుకనే వారి దశాబ్దాల పాటు కొనసాగింది. ఇద్దరూ ఆదర్శ స్నేహితులుగా మిగిలిపోయారు
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now