Thu Apr 03 2025 07:24:23 GMT+0000 (Coordinated Universal Time)
సీఎంగా బాధ్యతలు చేపట్టిన అతిశి ఏం చేశారో తెలుసా?
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశి బాధ్యతలను స్వీకరించారు. కేజ్రీవాల్ పై తన గౌరవాన్ని చాటుకున్నారు

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశి బాధ్యతలను స్వీకరించారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామాతో ఆమెను ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్షం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే తనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిన కేజ్రీవాల్ పై అతిశి తన గౌరవాన్ని చాటుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను చేపట్టినప్పటికీ తన పక్కనే కేజ్రీవాల్ ఉన్నట్లు ఆమె భావించేలా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నారు.
తన కుర్చీ పక్కనే....
తన కుర్చీ పక్కనే అరవింద్ కేజ్రీవాల్ మొన్నటి వరకూ కూర్చునే కుర్చీని వేయించుకున్నారు. దానిని ఖాళీగానే ఉంచి తాను వేరే ఛెయిర్ లో ముఖ్యమంత్రిగా అతిశి బాధ్యతలను స్వీకరించారు. అరవింద్ కేజ్రీవాల్ పైన తనకున్న నమ్మకాన్ని మరోసారి అతిశి చాటుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాయి.
Next Story