Sat Apr 26 2025 13:13:17 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ ప్రమాణ స్వీకారం
నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు

నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆమె రాజ్‌భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్య నేతలు మాత్రమే ఈ కార్యక్రమానికి హజరు కానున్నారు. అతిశీతో పాటు ఐదుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిసింది. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
కేజ్రీవాల్ రాజీనామాతో...
ఢిల్లీ మద్యం కేసులో తనను నిందితుడిగా చేర్చినందున తాను సీఎం పదవిలో ఉండనని ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్షం అతిశీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసింది. స్వయంగా కేజ్రీవాల్ అతిశీ పేరు ను ప్రతిపాదించడంతో సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈరోజు అతిశీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Next Story