Mon Jan 06 2025 08:35:54 GMT+0000 (Coordinated Universal Time)
మహిళా పోలీసుపై బీజేపీ ఎమ్మెల్యే దాడి
ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. మహిళా పోలీసు అధికారిపై బీజేపీ ఎమ్మెల్యే ఒకరు దాడి చేశారు. ఈ ఘటన భువనేశ్వర్ లో జరిగింది
ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. మహిళా పోలీసు అధికారిపై బీజేపీ ఎమ్మెల్యే ఒకరు దాడి చేశారు. ఈ ఘటన భువనేశ్వర్ లో జరిగింది. ఒడిశా బీజేపీ ప్రతిపక్ష నేత జయనారాయణ మిశ్రా ఒక మహిళ పోలీసు అధికారికి లంచాన్ని డిమాండ్ చేస్తున్నారంటూ ఆమెపై దాడికి దిగారు. ధనుపాలి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అనితా ప్రధానే తనను నెట్టారని ఆరోపించారు. అయితే జయనారాయణ మిశ్రా దీనిని ఖండించారు.
పరస్పరం ఫిర్యాదులు...
అనితా ప్రధాన్ పై ఎలాంటి దాడి చేయలేదని, కేవలం లంచాలు ఎందుకు అడుగుతున్నావని మాత్రమే ప్రశ్నించానని అన్నారు. దీనికి సంబంధించి ఇటు అనితా ప్రధాన్ అటు జయనారాయణ మిశ్రాలు పోలీసు స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తనపై అకారణంగా దాడి చేశారంటూ అనితా ప్రధాన్ చెబుతుండగా, తాను కేవలం వాగ్వాదానికి మాత్రమే దిగానని, ఆమే తనను వెనక్కు నెట్టివేసిందని ఎమ్మెల్యే చెబుతున్నారు. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.
Next Story