Sat Dec 28 2024 13:15:09 GMT+0000 (Coordinated Universal Time)
అయోధ్యలో దీపోత్సవ్.. 15 లక్షల దీపాలతో గిన్నిస్ రికార్డు
ఈ దీపోత్సవానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. తొలుత అయోధ్యలో ..
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్య నగరంలో నిర్వహించిన దీపోత్సవ్ సంబరాలు అంబరాన్నంటాయి. ఆదివారం రాత్రి సరయు నదీతీరంలో రామ్ కి పైడి వద్ద 15 లక్షలకు పైగా మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఉత్తరప్రదేశ్ లోని అవధ్ విశ్వవిద్యాలయానికి చెందిన 22 మంది వాలంటీర్లు 15 లక్షల 76 వేల దీపాలను వెలిగించి గిన్నిస్ రికార్డులో భాగమయ్యారు.
ఈ దీపోత్సవానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. తొలుత అయోధ్యలో రాముడిని దర్శించుకున్న మోదీ.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరామ జన్మభూమి తీర్థేత్ర నిర్మాణ పనులను సమీచ్చించారు. శ్రీరాముడి లాంఛనప్రాయ పట్టాభిషేకంలో పాల్గొని సీతారాముళ్లకు హారతినిచ్చారు. అనంతరం అయోధ్యలో బాణసంచా, లేజర్ షో కార్యక్రమాలను తిలకించారు. ప్రమిదల వెలుగుల్లో అయోధ్య నగరం మిలమిలా మెరిసిపోయింది.
Next Story