Sun Dec 22 2024 17:18:59 GMT+0000 (Coordinated Universal Time)
నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. వైరలవుతున్న ఫొటోలు
చిన్నారి 2.3 కేజీల బరువుంది. గ్వాలియర్ లోని కమ్లా రాజా ఆస్పత్రిలో ఆర్తి కుశ్వాహ అనే మహిళ బుధవారం ఈ బబిడ్డకు..
అప్పుడప్పుడు కొందరు శిశువులు వింతగా జన్మిస్తుంటారు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ శిశువు అలాగే జన్మించింది. నాలుగు కాళ్లతో జన్మించిన ఆ శిశువు ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. చిన్నారి 2.3 కేజీల బరువుంది. గ్వాలియర్ లోని కమ్లా రాజా ఆస్పత్రిలో ఆర్తి కుశ్వాహ అనే మహిళ బుధవారం ఈ బబిడ్డకు జన్మనిచ్చింది. నాలుగు కాళ్లతో ఉన్న శిశువుని చూసి వైద్యులు షాకయ్యారు. వెంటనే జయారోగ్య హాస్పిటల్ గ్రూప్ సూపరింటెండెంట్ డా.ఆర్కే ధాకడ్ తన వైద్యబృందంతో చిన్నారిని పరిశీలించారు.
చిన్నారికి నాలుగు కాళ్లుండటం పుట్టుక లోపమని, ఆమెకు శారీర వైకల్యం ఉందని తెలిపారు. అదనంగా ఏర్పడిన పిండాలు.. రెండు భాగాలుగా విడిపోయి శరీరం రెండు చోట్ల అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ శిశువు విషయంలో అదే జరిగిందని, దీనిని ఇస్కియోపాగస్ అంటారని తెలిపారు. శిశువుకు ఇతర శరీర భాగాల్లో ఏమన్నా వైకల్యం ఉందా ? అని పరిశీలించిన అనంతరం ఆమె ఆరోగ్యంగా ఉంటే.. అదనంగా ఉన్న రెండు కాళ్లను శస్త్ర చికిత్స ద్వారా తొలగిస్తామని తెలిపారు.
Next Story