Sun Dec 29 2024 05:00:43 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీమంతులే.. అయినా పెళ్లిళ్లు అవ్వడం లేదట !
మాండ్య నుంచి ప్రముఖ శైవక్షేత్రమైన మలెమహదేవన బెట్టకు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మాండ్య నుంచి 105 కిలోమీటర్ల
ఒక్కొక్కరికీ 10 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. ఏడాదికి మూడు పంటలు పండిస్తూ.. రెండుచేతులా సంపాదన ఉంది. అయినా సరే.. వారు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరకడం లేదట. మూడు పదుల వయసొచ్చి మీదపడుతున్నా.. వివాహ ఘడియలు దరి చేరట్లేదని వాపోతున్నారు. అందుకే తమకు వీలైనంత త్వరగా పెళ్లిళ్లవ్వాలని కోరుకుంటూ.. సుమారు 200 మంది యువకులు శివాలయానికి పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కర్ణాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన యువకులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు.
మాండ్య నుంచి ప్రముఖ శైవక్షేత్రమైన మలెమహదేవన బెట్టకు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మాండ్య నుంచి 105 కిలోమీటర్ల దూరంలో చామరాజనగర జిల్లాలోని బెట్టకు ఈ నెల 23న వీరి పాదయాత్ర ప్రారంభం కానుంది. మాండ్యా జిల్లాలోని మద్దూరు తాలూకా కేఎందొడ్డి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువకుల వయసు 30-34 సంవత్సరాలు. అంతా శ్రీమంతులే. జీవితంలో బాగా స్థిరపడినా వివాహం చేసుకునేందుకు అమ్మాయిలు దొరకకపోవడంతో బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు. అందుకు కారణాలు రెండు. ఒకటి స్త్రీ - పురుష నిష్పత్తిలో తేడా ఒకటైతే.. ఇతర ప్రాంతాల వారు వారికి పిల్లనిచ్చేందుకు ముందుకు రాకపోవడం మరో కారణం.
తమ ఆవేదనను ఇక ఆ శివుడే అర్థం చేసుకుంటాడని భావించి.. అంతా ఒక్కటై ‘బ్రహ్మచారుల పాదయాత్ర’ పేరిట యాత్ర చేస్తున్నట్టు ప్రకటించగానే బెంగళూరు, మైసూరు, మాండ్య, శివమొగ్గ జిల్లాల నుంచి 100 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ నెల 23న వీరి పాదయాత్ర ప్రారంభం కానుంది. యాత్రలో పాల్గొనేవారు ఖర్చును సమానంగా భరించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడీ పాదయాత్ర హాట్ టాపిక్‌గా మారింది.
Next Story