Mon Dec 23 2024 18:33:58 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బ్యాంకులు క్లోజ్.. ఏయే ప్రాంతాల్లో అంటే..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్ ప్రకారం.. త్రిపుర, బేలాపూర్, మధ్యప్రదేశ్, పంజాబ్ మరియు హర్యానా..
న్యూ ఢిల్లీ : ఈ రోజు మే 16న బుద్ధ పూర్ణిమ సందర్భంగా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్ ప్రకారం.. త్రిపుర, బేలాపూర్, మధ్యప్రదేశ్, పంజాబ్ మరియు హర్యానా, ఉత్తరాఖండ్, జమ్ము, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లోని బ్యాంకులు ఈ రోజు మూసివేయబడనున్నాయి. ఈ సంవత్సరం మే 16న బుద్ధ పూర్ణిమ వచ్చింది. గౌతమ బుద్ధుని జన్మదినాన్ని కొన్ని ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎప్పటికప్పుడు బ్యాంకులకు సెలవులపై డేటాను విడుదల చేస్తూ ఉంటుంది. బ్యాంకు సెలవులను మూడు విభాగాల కింద విభజించింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద హాలిడే(Holiday under Negotiable Instruments Act), (Holiday under Negotiable Instruments Act) నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవు, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడే బ్యాంకుల ఖాతాల ముగింపు(Real-Time Gross Settlement Holiday; and Banks' Closing of Accounts).
మే 2022లో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలతో సహా మొత్తం 11 బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మే 2022లో ఇతర బ్యాంక్ సెలవులు: 22 మే 2022: వీక్లీ ఆఫ్ (ఆదివారం), 28 మే 2022: నాల్గవ శనివారం, 29 మే 2022: వీక్లీ ఆఫ్ (ఆదివారం)
Next Story