Mon Dec 23 2024 10:58:21 GMT+0000 (Coordinated Universal Time)
ఏప్రిల్ లో ఏకంగా 15 రోజులు మూతపడనున్న బ్యాంకులు.. వివరాలివీ
ఏప్రిల్ 7 గుడ్ ఫ్రైడే కావడంతో సెలవు. ఆరోజున అగర్తలా, అహ్మదాబాద్, గువాహటి, జైపూర్, జమ్ము, సిమ్లా, శ్రీనగర్ లో బ్యాంకులు..
ప్రతి ఏటా మార్చి నెలను ఆర్థిక సంవత్సరానికి చివరి నెలగా పరిగణిస్తారు. 2022-23 ఆర్థిక సంవత్సరం మరో వారంరోజుల్లో ముగియనుంది. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ నెలలో బ్యాంకులు ఏకంగా 15 రోజులు మూతపడనున్నాయి. వాటిలో రెండు శనివారాలు, నాలుగు ఆదివారాలు, పబ్లిక్ హాలిడేలు, రాష్ట్రాల్లో జరుపుకునే పండుగలు ఉన్నాయి.
ఏప్రిల్ 1ని నూతన ఆర్థిక ఏడాది ప్రారంభం రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసిఉంటాయి. ఐజ్వాల్, షిల్లాంగ్, సిమ్లా, చండీగఢ్ ప్రాంతాల్లో మాత్రం బ్యాంకులు తెరిచి ఉంటాయి. ఏప్రిల్ 2 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. ఏప్రిల్ 4న మహావీర్ జయంతి సదర్భంగా వివిధ నగరాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో బ్యాంకులు మూసి ఉంటాయి.
ఏప్రిల్ 7 గుడ్ ఫ్రైడే కావడంతో సెలవు. ఆరోజున అగర్తలా, అహ్మదాబాద్, గువాహటి, జైపూర్, జమ్ము, సిమ్లా, శ్రీనగర్ లో బ్యాంకులు తెరిచి ఉంటాయి. ఏప్రిల్ 8న రెండో శనివారం, 9న ఆదివారం కావడంతో సెలవు. ఏప్రిల్ 14 డా.బీ.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. ఐజ్వాల్, భోపాల్, ఢిల్లీ, రాయ్ పుర్, షిల్లాంగ్, సిమ్లా ప్రాంతాల్లో మినహా దేశమంతా బ్యాంకులు మూతపడతాయి.
ఏప్రిల్ 15వ తేదీన వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పండగలు ఉన్నాయి. విషు, బొహాగ్, బిహు, హిమాచల్ డే, బెంగాలీ న్యూ ఇయర్ కారణంగా అగర్తలా, గువాహటి, కొచ్చి, కోల్కతా, షిమ్లా, తిరువనంతపురంలలో బ్యాంకులు మూసి ఉంటాయి. ఏప్రిల్ 16న ఆదివారం కాబట్టి బ్యాంకులు మూత పడతాయి. ఏప్రిల్ 18న జమ్ము అండ్ శ్రీనగర్ ప్రాంతాల్లో షాబ్ ఇ కబర్ కారణంగా బ్యాంకులు మూసి ఉంటాయి. ఏప్రిల్ 21న ఈద్ ఉల్ ఫితర్ కారణంగా ఏప్రిల్ 21న అగర్తలా, జమ్ము, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
ఏప్రిల్ 22 నాలుగో శనివారంతో పాటు ఈద్ సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి. ఏప్రిల్ 23 ఆదివారం సెలవు దినం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసే ఉంటాయి. ఏప్రిల్ 30న కూడా ఆదివారం సందర్భంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూత పడనున్నాయి. ఇలా మొత్తంగా ఏప్రిల్ 1,2,4,5,7,8,9,14,15,16,18,21,22,23,30, తేదీలలో బ్యాంకులు మూతపడనున్నాయి. మీ ప్రాంతాల్లో బ్యాంకుల సెలవులను తెలుసుకుని లావాదేవీలు జరుపుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
Next Story