Mon Dec 23 2024 10:33:17 GMT+0000 (Coordinated Universal Time)
మార్చి నెలలో 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు
ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం..మార్చి 5, 12, 19, 26 తేదీల్లో ఆదివారాలు వచ్చాయి. సాధారణంగానే నెలలో నాలుగు ఆదివారాలు..
మార్చి నెలలో బ్యాంకుల సెలవుల వివరాలిలా ఉన్నాయి. మొత్తం నెలలో 12 రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. హోలీ, ఉగాది, శ్రీరామనవితో పాటు వివిధ పండుగలు, ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు ఇలా మొత్తం కలిపి మార్చిలో బ్యాంకులకు 12 రోజులు సెలవులొచ్చాయి. ఈ జాబితాను ఆర్బీఐ వెబ్సైట్లో విడుదల చేసింది. మార్చి నెలే ఆర్థిక సంవత్సరానికి చివరి నెల కావడంతో బ్యాంకు ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం..మార్చి 5, 12, 19, 26 తేదీల్లో ఆదివారాలు వచ్చాయి. సాధారణంగానే నెలలో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు బ్యాంకులకు సెలవులుంటాయి. మార్చి 11, 25 తేదీల్లో రెండవ, నాల్గో శనివారాలు కావడంతో బ్యాంకులు మూసి ఉంటాయి. మార్చి 3(శుక్రవారం) – చుప్చార్ కుట్ పండుగ సందర్భంగా త్రిపుర రాజధాని అగర్తలలో బ్యాంకులకు సెలవు. మార్చి 7 (మంగళవారం)- హోలీ పండుగ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. మార్చి 8 ( బుధవారం) – హోలీ సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు. మార్చి 9 (గురువారం) – హోలీ పాట్నా.
మార్చి 22 (బుధవారం) – ఉగాది పండుగ (తెలుగు సంవత్సరాది) సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి. అలాగే.. మార్చి 30 ( గురువారం) శ్రీరామనవమి సందర్భంగా.. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇలా మొత్తంగా మార్చి నెలలో 12 రోజులు బ్యాంకులు పనిచేయవు.
Next Story