Thu Nov 21 2024 22:45:29 GMT+0000 (Coordinated Universal Time)
Bank Holidays: నవంబర్ నెలలో బ్యాంకు హాలిడేస్ ఇవే.. చూసుకుని వెళ్ళండి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్ 2024 కోసం బ్యాంక్ సెలవులను విడుదల చేసింది. ఈ నెలలో కూడా అనేక సెలవులు ఉన్నాయి. మొత్తం 12 రోజులు బ్యాంకులు మూసివేస్తారు. సెలవులు, ప్రాంతీయ పండుగలు, ఈవెంట్లు ఈ హాలిడేస్ లో ఉంటాయి. అయితే అవి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు హాలిడేస్.
నవంబర్ 1 (శుక్రవారం): దీపావళి, కుత్, కన్నడ రాజ్యోత్సవాల కారణంగా త్రిపుర, కర్ణాటక, ఉత్తరాఖండ్, జమ్మూ & కాశ్మీర్, మహారాష్ట్ర, మేఘాలయ, సిక్కిం, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో కూడా బ్యాంకులకు హాలిడే.
నవంబర్ 2 (శనివారం): గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లోని బ్యాంకులు దీపావళి, లక్ష్మీ పూజ, గోవర్ధన్ పూజల కోసం హాలిడే ప్రకటించారు.
నవంబర్ 7 (గురువారం): ఛత్ (సాయంత్రం అర్ఘ్య) సందర్భంగా బెంగాల్, బీహార్, జార్ఖండ్తో సహా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయనున్నారు.
నవంబర్ 8 (శుక్రవారం): ఛత్ (ఉదయం అర్ఘ్య)/వంగల పండుగ సందర్భంగా బీహార్, జార్ఖండ్, మేఘాలయ వంటి కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలిడే.
నవంబర్ 15 (శుక్రవారం): గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ/రహస్ పూర్ణిమ సందర్భంగా, మిజోరాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, బెంగాల్, న్యూఢిల్లీ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్ లలో హాలిడే ఉంటుంది.
నవంబర్ 18 (సోమవారం): కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో అన్ని బ్యాంకులు మూసివేయనున్నారు.
నవంబర్ 23 (శనివారం): మేఘాలయలో, సెంగ్ కుత్స్నెమ్ సందర్భంగా బ్యాంకులు మూసివేయనున్నారు.
Next Story