Fri Mar 14 2025 23:08:50 GMT+0000 (Coordinated Universal Time)
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. బ్యాంక్ ఆఫ్ బరోడాలో నాలుగువేల ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఉద్యోగార్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. అభ్యర్థుల వయసు ఇరవై ఏళ్ల నుంచి ఇరవై ఎనిమిదేళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్కొంది.
అర్హతలివే...
కనీస విద్యార్హతలు డిగ్రీగా పేర్కొంది. ఏదైనా దేశంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణులయిన వారు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు దశల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తామని బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ లో పేర్కొంది. ఆన్ లైన్ పరీక్షతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజీ ఆఫ్ ది స్టేట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపింది. మరిన్ని వివరాలకు https://www. bnakofbaroda.in/ సైట్ లో దరఖాస్తు చేసుకునే వీలుందని తెలిపింది.
Next Story